ముందు సీతావతారం… తరువాత ద్రౌపదిగా దీపిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మాత మధు మంతెన, దీపికా పదుకొణే కొలాబరేషన్ లో ‘మహాభారత్’ సినిమా వస్తుందని ఆ మధ్య ప్రకటించారు. ద్రౌపది దృష్టి కోణం నుంచీ కథ చెబుతామని కూడా అన్నారు. కానీ, ఆ తరువాత వెండితెర ఇతిహాసం గురించి ఇదీ సంగతి అని ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో ‘ద్రౌపదిగా దీపికా’ అనే ప్రాజెక్ట్ కాస్త వెనుకబడిపోయింది. ఇప్పుడు మరోసారి, దీపికతో సినిమాపై భారీ చిత్రాల నిర్మాత మధు మంతెన నోరు విప్పాడు! మహాభారతం కాదు ముందుగా రామాయణం అంటున్నాడు…
Read Also : పెట్ యానిమల్స్ మీద దీపికా పదుకొణే పెట్టుబడులు!
Also Read
- Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
- Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
- Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
నిర్మాత మధు తమ మహాభారత్ సినిమా గురించి మాట్లాడుతూ కొంచెం టైం పడుతుందని అన్నాడు. ఎపిక్ మూవీస్ తీసేప్పుడు ఇలాంటి ఆలస్యం సహజమేనని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే, దీపికని ద్రౌపదిగా చూపే దాని కంటే ముందు ఆమె తన సినిమాలో సీతగా దర్శనం ఇస్తుందని కొత్త మాట చెప్పాడు. నిర్మాత మధు, దీపికా పదుకొణే కాంబినేషన్ లో మొదట ‘రామాయణం’ తెరకెక్కుతుందట. ఇప్పటికే వివిధ గ్రంథాల్ని పోగు చేయటం, వేటి ఆధారంగా ఫైనల్ స్క్రిప్ట్ రాసుకోవాలో నిర్ణయించటం జరిగిపోయిందట. దీపావళి సందర్భంగా నటీనటుల వివరాలు వెల్లడిస్తానని ఆయన ఆన్నాడు!
‘రాణీ పద్మావతి’గా, ‘మస్తానీ’గా దీపికా ఇప్పటికే చారిత్రక పాత్రలు పోషించింది. ఆమె ‘సీతగా, ద్రౌపదిగా’ పౌరాణిక పాత్రలు కూడా పోసిస్తే చూడాలని ఫ్యాన్స్ తో పాటూ సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. నిర్మాత మధు మంతెన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఎప్పటికి సెట్స్ మీదకి వెళతాయో మరి!
తాజావార్తలు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!