Site icon NTV Telugu

Kalki 2898 AD : కల్కి ఆ సినిమాకి కాపీ.. నాగ్ అశ్విన్ క్లారిటీ

Whatsapp Image 2024 04 30 At 8.21.11 Am

Whatsapp Image 2024 04 30 At 8.21.11 Am

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు .ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్‌ మరియు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకోన్‌ మరియు దిశాపటాని ప్రభాస్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన రానా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమాను ముందుగా మే 9 న విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు .కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 2024 జూన్ 27 విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అధికారక ప్రకటన చేసింది.ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది . ఈ పోస్టర్‌లో అమితాబ్‌, ప్రభాస్‌ మరియు దీపికా పదుకోన్ నిలబడి ఉండగా ఎడారి లాంటి ప్రాంతంలో కొందరు పడి ఉండడం కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూసాక ఈ చిత్రం హాలీవుడ్ సినిమా “డూన్” కు కాపీ అనే ప్రచారం ఊపందుకుంది.హాలీవుడ్ లో తెరకెక్కిన అనేక సైన్స్ ఫిక్షన్ సినిమాలకు డూన్ నవల ఎంతో స్ఫూర్తిగా నిలిస్తుందని చాలా మంది అభిప్రాయం . ఇక డూన్ నవల స్ఫూర్తితోనే డూన్ (2021 రిలీజ్) సినిమా కూడా తెరకెక్కింది.ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రానికి కూడా ఇదే నవల స్ఫూర్తి అని కొందరు వాదిస్తున్నారు.అయితే తాజాగా ఈ కాపీ ఆరోపణలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.నాగ్ అశ్విన్ కాపీ ఆరోపణలను కొట్టిపారేసారు.కేవలం డూన్ లో ఇసుక అలాగే కల్కి మూవీలో ఇసుక ఉండటం వల్ల రెండు సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు నమ్మకూడదని ఆయన తెలిపారు.దీనితో కల్కి మూవీపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ వచ్చింది .ఇదిలా ఉంటే ఇటీవల ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ‘అశ్వత్థామ’ గ్లింప్స్‌ ప్రేక్షకులకి తెగ నచ్చేసింది. మహాభారతాన్ని లింక్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ కల్కి మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version