Kalki 2898 AD : కల్కి ఆ సినిమాకి కాపీ.. నాగ్ అశ్విన్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు .ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్ మరియు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకోన్ మరియు దిశాపటాని ప్రభాస్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన రానా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమాను ముందుగా మే 9 న విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు .కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 2024 జూన్ 27 విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అధికారక ప్రకటన చేసింది.ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది . ఈ పోస్టర్‌లో అమితాబ్, ప్రభాస్ మరియు దీపికా పదుకోన్ నిలబడి ఉండగా ఎడారి లాంటి ప్రాంతంలో కొందరు పడి ఉండడం కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూసాక ఈ చిత్రం హాలీవుడ్ సినిమా “డూన్” కు కాపీ అనే ప్రచారం ఊపందుకుంది.హాలీవుడ్ లో తెరకెక్కిన అనేక సైన్స్ ఫిక్షన్ సినిమాలకు డూన్ నవల ఎంతో స్ఫూర్తిగా నిలిస్తుందని చాలా మంది అభిప్రాయం . ఇక డూన్ నవల స్ఫూర్తితోనే డూన్ (2021 రిలీజ్) సినిమా కూడా తెరకెక్కింది.ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రానికి కూడా ఇదే నవల స్ఫూర్తి అని కొందరు వాదిస్తున్నారు.అయితే తాజాగా ఈ కాపీ ఆరోపణలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.నాగ్ అశ్విన్ కాపీ ఆరోపణలను కొట్టిపారేసారు.కేవలం డూన్ లో ఇసుక అలాగే కల్కి మూవీలో ఇసుక ఉండటం వల్ల రెండు సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు నమ్మకూడదని ఆయన తెలిపారు.దీనితో కల్కి మూవీపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ వచ్చింది .ఇదిలా ఉంటే ఇటీవల ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ‘అశ్వత్థామ’ గ్లింప్స్ ప్రేక్షకులకి తెగ నచ్చేసింది. మహాభారతాన్ని లింక్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ కల్కి మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
Also Read
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
- Trivikram Srinivas: 'ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం' వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
తాజావార్తలు
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?