Site icon NTV Telugu

సాంగ్స్ తో సందడి చేయడానికి సిద్ధమవుతున్న “మాస్ట్రో”

Maestro Music Fest Begins Next Week

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ హిట్ మూవీ “అంధాదున్”కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్ లో సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కన్పించనుంది. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫైన‌ల్ షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

Read Also : ఇదెక్కడి రచ్చ రా బాబూ… మరీ ఇంత హాట్ గానా..!

ఈ చిత్రాన్ని ఓటిటిలోనే విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ తో నేరుగా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించిన డీల్ కూడా క్లోజ్ అయ్యిందని అంటున్నారు. మరోవైపు “మాస్ట్రో” టీం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేసింది. వచ్చేవారం నుంచి “మాస్ట్రో” సాంగ్స్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో నితిన్ అభిమానులు “మాస్ట్రో” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

Exit mobile version