ప్రసిద్ధ నటుడు ఆర్. మాధవన్, ఫాతిమా సనా షేక్ జంటగా నటించిన చిత్రం ‘ఆప్ జైసా కోయి’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. జులై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, వయసు వ్యత్యాసం, వైవాహిక జీవితం పై ప్రభావం వంటి అంశాలపై ఆయన ఎంతో స్పష్టంగా, కొంత సాహసంగా అభిప్రాయాలు వెల్లడించారు.
Also Read : Prabhas : వింటేజ్.. స్టైలిష్ లుక్‌లో మెరిసిన ప్రభాస్..
‘సహ నటీనటుల మధ్య నిజమైన అనుబంధం ఉంటేనే కెమిస్ట్రీ బాగా పని చేస్తుంది. అది లేకపోతే ఎలాంటి సన్నివేశాలైనా ఎమోషనల్‌గా పండవు. ఇది కొంచెం వివాదాస్పదంగా వినిపించవచ్చు కానీ.. నా అభిప్రాయం ప్రకారం, వివాహితులు ఇతరులతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అంత సహజంగా ఉండదు. మనసులో ఎక్కడో కొంత ఆంక్ష ఉంటుంది. అలాగే వయసు వ్యత్యాసం అనేది సినిమా కథకు పెద్ద అడ్డంకి కాదు. నిజ జీవితంలో కూడా వయసులో తేడా ఉన్న జంటలు చాలానే ఉన్నారు. ప్రేక్షకులు కథకి స్పందిస్తారు, నటుల వయసుకు కాదు’ అంటూ తెలిపారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
