Prabhas : వింటేజ్.. స్టైలిష్ లుక్‌లో మెరిసిన ప్రభాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్లాసిక్ మూవీ ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలై నేటికి పది సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులే కాకుండా, చిత్ర బృందమంతా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. అదే సమయంలో ప్రభాస్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అది కూడా ఈసారి తన స్టైలిష్ లుక్ తో. ప్రస్తుతం ప్రభాస్, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘ది రాజా సాబ్’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మొదటి నుంచి సంబంధం ఉన్న మాస్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ (SKN) తాజాగా సెట్స్ నుంచి ఓ ఫోటోను షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Kothapalli Lo Okappudu: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ రిలీజ్..
Also Read
ఈ ఫోటోలో ప్రభాస్ కనిపించిన విధానం అభిమానుల మన్ననలు పొందుతోంది. స్టైలిష్ గా ఓ వింటేజ్ లుక్‌లో – ఓపెన్ షర్ట్, కూల్ గ్లాసెస్, లైట్ బీట్ క్రాఫ్ట్ లుక్ లో కనిపించిన ప్రభాస్ యూత్‌ఫుల్ ఎనర్జీకి ప్రతీకగా నిలిచాడు. చాలా కాలం తర్వాత ప్రభాస్‌ను ఇలాంటి మాస్ క్లాస్ లుక్‌లో చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇదే సందర్భంగా SKN చేసిన వ్యాఖ్యలు కూడా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచాయి. “ఇది కేవలం ఓ బర్త్‌డే మూమెంట్ మాత్రమే కాదు, రాబోయే విజయం కోసం మొదటి సూచన కూడా..! ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తాయనడం గ్యారంటీ” అంటూ SKN తెలిపాడు. బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకున్న స్పెషల్ రోజున ఇలా ప్రభాస్ నుంచి వచ్చిన తాజా లుక్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!