NTV Telugu Site icon

MAD Square : మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Mad

Mad

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. గతేడాది ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్‌’ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Also Read : MAZAKA : మజాకా ట్రైలర్.. 3 సార్లు జై బాలయ్య అనాల్సిందే

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ఈ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మ్యాడ్ 2 టీజర్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. మ్యాడ్ స్క్వేర్ టీజర్ ను ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నాం అని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. మొదటి భాగానికి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన పాటలన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో అంతకుమించిన చార్ట్‌ బస్టర్ పాటలు ఈ సీక్వెల్ లో ఉండబోతున్నాయి. అందరూ మెచ్చుకునేలా ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్  సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరూ, రెండో భాగాన్ని మరింత ఇష్టపడతారని నిర్మాతలు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. రెట్టింపు వినోదంతో, రెట్టింపు విజయాన్ని ఖాతాలో వేసుకుంటామని చిత్ర బృందం చెబుతోంది. భారీ అంచనాలు ఉన్న మ్యాడ్ 2 మార్చి 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.