కోలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు ఆర్‌ఎస్‌జి చెల్లాదురై ఏప్రిల్ 29 సాయంత్రం చెన్నైలోని పెరియార్ నగర్‌లోని తన నివాసంలో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగాయి. చెల్లాదురై తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ నటుల్లో ఒకరు. గురువారం ఆయన తన నివాసంలోని బాత్రూంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 84 ఏళ్ల నటుడు గుండెపోటుతో చనిపోయాడని ఆయన కుమారుడు వెల్లడించారు. చెల్లాదురై మృతికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు. కోలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు చెల్లాదురై. మారి, థెరి, కత్తి, శివాజీతో చిత్రాల్లో ఆయన నటించిన పాత్రలు అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. విజయ్ ‘థెరి’లో తప్పిపోయిన తన కుమార్తె చనిపోయిందని తెలిసినప్పుడు ఆయన పాత్ర పడే ఆవేదన ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది.
కోలీవుడ్ సీనియర్ నటుడు మృతి
