Maa Oori Polimera 2 Producer Gauri Krishna files Complaint on Vamshi Nandipati: టాలీవుడ్ నిర్మాత గౌరీ కృష్ణ తనను మరో నిర్మాత చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఊరి పొలిమేర 2 సినిమాతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న గౌరీ కృష్ణ. ఈ సినిమాని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాకి సంబంధించి తనకు రావాల్సిన షేర్ ఇవ్వకుండా అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు అంటూ మరో టాలీవుడ్ నిర్మాత మీద గౌరీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఉదయం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఫిర్యాదు మేరకు తాను మా ఊరి పొలిమేర 2 అనే సినిమా నిర్మాతనని ఆ సినిమా నిర్మించిన తర్వాత సినిమాని వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని హక్కులు తమకు ఇవ్వాల్సిందిగా నందిపాటి వంశీ, సుబ్బారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు తనను అప్రోచ్ అయ్యారని చెప్పుకొచ్చారు.
Rakul Preet Brother: షాకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్
తనకు కూడా వారి అగ్రిమెంట్ నచ్చడంతో వారికి సినిమా రైట్స్ రాసిచ్చానని గౌరీ కృష్ణ వెల్లడించారు. అయితే సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టినట్టు తెలుగులో లీడింగ్ న్యూస్ పేపర్లతో పాటు మీడియా కూడా కవర్ చేసిందని ఈ నేపథ్యంలో తనకు రావలసిన షేర్ ని అడిగితే ముందు కొన్నాళ్ల పాటు కాలం గడుపుతూ వచ్చిన వంశీ నందిపాటి తరువాత ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశాడని చెప్పుకొచ్చారు. తాను వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి అడిగితే డబ్బులు ఇచ్చేది లేదని ఇంకా గట్టిగా మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదైనా ఆఫీసులకు వెళ్లినా, సంఘాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ప్రాణాలు దక్కవని కూడా హెచ్చరించినట్లు వెల్లడించారు. తనకు ప్రాణ భయంతో పాటు తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు గౌరీ కృష్ణ పేర్కొన్నారు.