తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ఈ మధ్య కాలంలో వరుస డిజాస్టర్లతో చేతులు కాల్చుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా ప్లాప్స్‌తో ఫైనాన్షియల్ స్ట్రగుల్ కన్నా రెప్యుటేషన్ పరంగా గ్రాఫ్ తగ్గుతుంది. స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించి అడ్డంగా బుక్కయ్యింది. మిషన్ చాప్టర్ 1, లాల్ సలామ్, వెట్టియాన్, ఇండియన్ 2, విదాముయర్చి లాంటి ప్రాజెక్టులు ఎలాంటి రిజల్ట్స్ అందించాయో అందరికీ తెలుసు.
Also Read : Kingdom : కింగ్డమ్ రిలీజ్ వాయిదా వేయక తప్పదా..?
ముఖ్యంగా కమల్ ఇండియన్ 2, రజనీ వెట్టియాన్, అజిత్ విదాముయర్చిపై భారీగా ఖర్చు పెట్టింది లైకా. ఈ మూడు ప్రాజెక్టుల వాల్యూ వెయ్యికోట్లు పైమాటే. కానీ తిప్పితిప్పి కొడితే వీటి నుండి వచ్చింది సగం కూడా లేదు. ఇక్కడ పొగొట్టుకున్నది కాస్త కూస్తో ఎంపురన్ లాభాల రూపంలో రికవరీ చేసుకోగలిగింది. సినిమా మీద ఫ్యాషన్‌తో ఆటుపోట్లును ఎదుర్కొంటోంది లైకా. ఇండియన్ 2తో భారీ దెబ్బతిన్నప్పటికీ ఇండియన్ 3తో తెరకెక్కించేందుకు ప్రిపేర్ అవుతుంది. కమల్ వల్ల నష్టాలు చూసినప్పటికీ అతడ్ని వదులుకోలేకపోతుంది. లైకా వరుస ప్రాజెక్టులను ఎనౌన్స్ చేస్తూ షాకిస్తోంది. ఇప్పటికే ఇండియన్ 3ని నిర్మాణ సంస్థ రూపొందిస్తుండగా ఇప్పుడు ఉళగనాయగన్ 237ని నిర్మిస్తోంది లైకా. భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తోందని టాక్. ఇప్పటి వరకు స్టంట్ మాస్టర్లుగా ఫ్రూవ్ చేసుకున్న ట్విన్ బ్రదర్స్ అన్బుమణి, ఆరివ్ మణి అలియాస్ అన్బరివ్ ఈ సినిమాతో దర్శకులుగా మారబోతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడలో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్ అందించిన ఈ నేషనల్ అవార్డ్ విన్నర్స్ కమల్‌ను డీల్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఇండియాన్ 2 తో లైకాకు భారీ నష్టాలు ఇచ్చిన కమల్, అన్బరివ్ సినిమాతో లైకాకు కాసుల వర్షం కురిపిస్తాడో లేదో.
