NTV Telugu Site icon

LuckyBaskhar : వందకోట్ల క్లబ్ లో దుల్కర్.. స్పెషల్ వీడియో రిలీజ్

Dulkar

Dulkar

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా  వసూళ్ల పరంగాను దుల్కర్ కు మైల్ స్టోన్ గా మూవీగా నిలిచింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.

Also Read : Kanguva : కంగువ స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో తెలుసా..?

తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా దుల్కర్ నటన, వెంకీ అట్లూరి దర్శకత్వం ఆడియెన్స్ ను అలరించింది. బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా తోలి రోజు రూ. 12.7 కోట్లు కొల్లగొట్టి దుల్కర్ కి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చిపెట్టింది. పోటీలో మరో రెండు సినిమాలు ఉన్నా కూడా లక్కీ భాస్కర్ ఎక్కడా తగ్గకుండా స్టడీ కలెక్షన్స్ రాబడుతూ దీపావళి మెగా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా రెండు వారాలకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 100.9కోట్ల గ్రాస్ సాధించింది.  ప్రస్తుతం రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా ముగించుకుని ముడవ వారంలో ఎంటర్ అయింది. అటు ఓవర్సీస్ లోను ఈ సినిమా $1.2 వసూళ్లు రాబట్టింది లక్కీ భాస్కర్. ఈ సినిమాతో తోలి సారి వందకోట్ల మార్కెట్ లో చేరాడు దుల్కర్ సల్మాన్.

Show comments