NTV Telugu Site icon

Lucky Baskhar: చరిత్ర సృష్టించిన లక్కీ భాస్కర్

Lucky Baskhar

Lucky Baskhar

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అక్టోబర్ 31, 2024 న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో చరిత్ర సృష్టించింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

Veera Dheera Sooran 2: వీర ధీర శూరన్2 కి మోక్షం.. కావాలనే వార్‌?

ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి వారంలో ఏకంగా 15 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ యొక్క టాప్ 10లో మొదటి స్థానాన్ని పొందింది. అలాగే 17.8 బిలియన్ నిమిషాల వీక్షణలతో, రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన తొలి సౌత్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.