అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్ రెడ్డి’. స్మరన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “లవ్ రెడ్డి” ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read : Vettaiyan : వెట్టయాన్ సక్సెస్ బిర్యానీ మీట్..
నట సింహ నందమూరి బాలకృష్ణ “లవ్ రెడ్డి” టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. తాజగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ లవ్ రెడ్డి చిత్ర యూనిట్ ను ఇన్‌స్టాగ్రామ్ లో అభినందిస్తూ పోస్ట్ చేసారు. కాగా లవ్ రెడ్డి సినిమాను మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సరైన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా యొక్క టికెట్ ధరలను తగ్గిస్తూ పోస్టర్ విడుదల చేసింది. లవ్ రెడ్డి సినిమా ప్రదర్శింప బడుతున్న సింగిల్ స్క్రీన్స్, మల్టిఫ్లెక్స్ లోని అన్ని థియేటర్స్ లో ఈ సినిమా టికెట్ ధరను కేవలం రూ. 112 మాత్రమే ఉండేలా నిర్ణయిస్తూ అనౌన్స్ చేసారు. చిన్న సినిమలకాజు ఇటువంటి నిర్ణయం కలిసి వచ్చే అవకాశం ఉంది. గతంలో కమిటీ కుర్రోళ్ళు, మారుతినగర్ సుబ్రమణ్యం విషయం లో కూడా ఇదే ప్యాట్రన్ కలిసొచ్చింది.