Pradeep Ranganathan : మరోసారి లవ్ టుడే కాంబినేషన్ రిపీట్.. ఈ సారి దర్శకుడు ఎవరంటే..?

Whatsapp Image 2024 05 02 At 12.07.38 Pm

Whatsapp Image 2024 05 02 At 12.07.38 Pm

తెలుగు లో రిలీజ్ అయిన తమిళ్ డబ్బింగ్ మూవీ “లవ్ టుడే” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ నటించాడు.హీరోయిన్ గా ఇవాన నటించింది.ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేశారు.ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.తాజాగా తెరకెక్కబోయే ఈ చిత్రానికి కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్ మరియు కల్పాతి ఎస్. సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఓ మై కడవులే’ (తెలుగులో ఓరి దేవుడా) ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా మెప్పించనున్నారు. మే నెల నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ససమాచారం.ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ సినిమా 26 వ చిత్రంగా తెరకెక్కుతుంది .ఇదిలా ఉంటే ఈ కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది.