Love Days : ‘లవ్ డేస్’ లెక్కపెడుతున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవీన్, కుసుమ చందక జంటగా ఆన్ క్యాన్ ఎంటర్టైన్మెంట్స్, క్రిసెంట్ సినిమాస్ బ్యానర్ల మీద మాదల వెంకటకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ డేస్’. ఏ టాక్సిక్ లవ్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘గీతాంజలి’, ‘తొలి ప్రేమ’, ‘అందాల రాక్షసి’ లాంటి అద్భుతమైన ప్రేమ కథల్లా ఈ ‘లవ్ డేస్’ నిలిచిపోతుంది. ‘లవ్ డేస్’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఈ మూవీ జీవితంలో ఎన్నో మెమోరీస్‌ను అందించాలని కోరుకుంటున్నాను. మనస్పూర్తిగా ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరో నవీన్ మాట్లాడుతూ .. ‘హీరోగా ఇది నాకు తొలి చిత్రం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మాకు మీడియా నుంచి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నాను. మా గ్లింప్స్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. త్వరలోనే మేం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.
Also Read
- Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్!
- Aditya Dhar: 'ధురందర్' తర్వాత ఆదిత్య ధర్‌కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్!
హీరోయిన్ కుసుమ మాట్లాడుతూ .. ‘‘లవ్ డేస్’ నాకు తొలి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్. నేను హీరోయిన్ అవ్వాలన్నది మా అమ్మ కోరిక. నేడు మా అమ్మ కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. మా మూవీని మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
-
Abhijeet Dipke: సోనమ్‌వాంగ్‌చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్‌లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!