Site icon NTV Telugu

Lokesh ; అజిత్‌తో సినిమా ప్లాన్‌పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ajith Kumar

Ajith Kumar

ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ డిమాండ్ ఉన్న యువ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ పేరు ఒకటి. 2019లో లోకేష్ కగరాజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ‘ఖైదీ’  ఎంత బ్లాక్ బాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ తర్వాత విక్రమ్, లియో వంటి ప్రాజెక్ట్స్ లతో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ కథతో ఒక యూనివర్స్ ను క్రియేట్ చేశారు. ఇక తన క్రియేటివ్ మేకింగ్‌ స్టైల్‌తో భారీ హైప్ క్రియేట్ చేసే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి చేస్తున్న ‘కూలీ’ చిత్రంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొన్న లోకేష్, మీడియా ఎదుట ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్టార్ హీరో అజిత్‌తో సినిమా చేసే అవకాశం గురించి వచ్చిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ..

Also Read : Aamir khan : ‘సితారే జమీన్ పర్’ డిజిటల్ ప్లాన్ అదుర్స్.. కానీ వర్కౌట్ అవుతుందా ?

‘అజిత్ సార్‌ అంటే నాకు చాలా ఇష్టం. మన మధ్య సినిమా ఖచ్చితంగా వస్తుంది, కానీ సరైన సమయం వచ్చినప్పుడు’ అని తెలిపారు. ఈ స్టేట్‌మెంట్‌తో అజిత్-లోకేష్ కలయికపై అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు కమల్ హాసన్‌, రజినీకాంత్‌ వంటి సీనియర్ లెజెండ్స్‌తో పాటు, తన తరం హీరో విజయ్‌తో రెండు సినిమాలు చేసిన లోకేష్.. అజిత్‌తో మాత్రం ఇప్పటివరకు అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు ఈ కామెంట్స్‌తో ఆ ఛాన్స్‌కి గ్రీన్ సిగ్నల్ పడినట్టే కనిపిస్తోంది. ఇప్పుడంతా ఎదురు చూస్తున్న ప్రశ్న.. “ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు ఫుల్‌ఫిల్ అవుతుంది?”

Exit mobile version