Site icon NTV Telugu

Lokesh Kanagaraj : ‘లియో’ ఇష్యూ.. సంజయ్ దత్‌కు క్షమాపణ చెప్పిన లోకేష్

Lokesh, Sanjay

Lokesh, Sanjay

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’  ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే సినిమా విడుదల తర్వాత సంజయ్ పాత్రపై సినీ వర్గాల్లో కొన్ని మిశ్రమ అభిప్రాయాలు వినిపించాయి. అయితే తాజాగా సంజయ్ దత్ కన్నడ మూవీ ‘కేడి ది డెవిల్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందర్భంలో, ‘లియో’ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘విజయ్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిందని చెప్పారు. కానీ నా పాత్రకు తగినంత స్థానం దక్కలేదు. నా కెరీర్‌, ఇమేజ్‌కి తగ్గట్టుగా స్క్రీన్ స్పేస్ ఇవ్వలేకపోయారు’ అన్న విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు.

Also Read : Anurag Kashyap : సెన్సార్‌పై ఆగ్రహంతో విరుచుకుపడిన అనురాగ్ కశ్యప్ !

అయితే ఈ మాటలు కాస్త లోకేష్ వరకు వెళ్లగా.. తాజాగా ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ ఈ విషయం పై మాట్లాడారు. “ఆయన మాటల్లో న్యాయం ఉంది. లియో సినిమాలో ఆయన పాత్రను ఇంకా బాగా ఉపయోగించాల్సింది. నా తప్పుడు అంచనాల వల్ల అది సాధ్యం కాలేదు. కానీ భవిష్యత్తులో, ఆయన ఇమేజ్‌కు తగ్గ పాత్రను ఖచ్చితంగా రాస్తాను. ఈ లోటును పూడుస్తాను” అంటూ క్షమాపణలు తెలిపారు. ప్రజంట్ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version