ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకులో లోకేష్ కనకరాజ్ ఒకరు. తక్కువ సినిమాలే తీసినప్పటికీ భారతీయ సినిమా పరిశ్రమలో గణనీయమైన ప్రభావం చూపారు. ఆయన సినిమాలు తమిళ సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి ఒక మూవీ మానగరం, ఖైదీ,విక్రమ్, లియో,మాస్టర్.. వరుస పెట్టి ప్రతి ఒక్క చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. లోకేష్ తన సినిమాల్లో తీవ్రమైన యాక్షన్, స్టైలిష్ విజువల్స్, బలమైన కథలను ఎంచుకుంటాడు అందుకే ఆయన చిత్రాలకు అంత డిమాండ్. ప్రజంట్ రజిని కాంత్ తో ‘కూలీ’ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ కోసం లోకేష్ చాలా కష్టపడుతున్నాడు. అయితే తాజాగా లోకేష్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది..
Also Read: kingdom : ‘కింగ్డమ్’ పై అనిరుధ్ ఫస్ట్ రివ్యూ..
దర్శకత్వంలో తన సత్తా చాటి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చాలా మంది, నటనపై మక్కువతో హీరోలుగా, యాక్టర్లుగా మారారు. కొంత యంగ్ డైరెక్టర్స్ కేవలం తమ పని మాత్రమే చేసుకుంటూ వెళుతున్నారు. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా మారుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడట. అది కూడా తానే స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందట. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ప్రజంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
