Site icon NTV Telugu

Lokah Chapter 1 Chandra: కల్యాణి, నస్లేన్‌.. ‘లోకా’ ట్రైలర్ చూశారా..

Lokha

Lokha

మలయాళీ నటి కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న “లోకా ఛాప్టర్ 1: చంద్ర” తెలుగు ‘లోకా’ వెర్షన్‌లో రాబోతోంది. హీరోగా నస్లేన్ కీలక పాత్రలో నటిస్తుండగా, అగ్ర స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను డామ్నిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఓనమ్ పండుగకు అనుగుణంగా, సెప్టెంబర్ మొదటి వారంలో పాన్ ఇండియా గా మలయాళంతో పాటు ఇతర భాషల్లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రెండు నిమిషాల 13 సెకండ్ల ట్రైలర్ విడుదల చేశారు.

Also Read : BIGG BOSS 19 : సల్మాన్ ఖాన్ ఫీ తగ్గింపు.. బిగ్ బాస్ 19లో కొత్త ట్విస్ట్ ఇదేనా?

ట్రైలర్ చూస్తే, భూత కాలం, ప్రస్తుత కాలాన్ని లింక్ చేస్తూ సూపర్ పవర్స్ కలిగిన చంద్ర పాత్రలో కథ సాగుతుందని స్పష్టమవుతుంది. అలాగే, స్థానిక పోలీసాఫీసర్‌తో విభేదం, యాక్షన్ సీన్లు, థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. హీరోయిన్స్ కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అందుకని హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ ద్వారా తెలుగు ట్రైలర్ ను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

 

Exit mobile version