NTV Telugu Site icon

RamCharan: మెగా స్టార్ బర్త్ డే కానుకగా స్పెషల్ ఫోటో షేర్ చేసిన చరణ్

Untitled Design (17)

Untitled Design (17)

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ వైడ్ గా పలు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం, అన్న దానం వంటి కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు మెగా అభిమానులు. అదే విధంగా మెగాస్టార్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ఇంద్ర. ఈ చిత్రం రిలీజ్ అయి 22 ఏళ్ళు అయిన సందర్భంగా, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర4k క్వాలిటీలో రీరిలీజ్ చేసారు మేకర్స్. వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఇంద్ర హౌసేఫుల్ షోస్ తో ఫ్యాన్స్ హంగామాతో థియేటర్లు మారు మోగుతున్నాయి.

Also Read: Naga Chaitanya: మాజీ భార్య సమంతకు పోటీగా.. నాగ చైతన్య ఏం చేసాడంటే..?

కాగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తనయుడు రామ్ చరణ్ ఓ స్పెషల్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. పట్టుపంచెలో రేబాన్ గ్లాసెస్ ధరించి నిలబడి ఉన్న చిరు, వెనుక అదే వేషధారణలో ఉన్న మెగా తనయుడు చరణ్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ పుట్టిన రోజూ శుభాకాంక్షలు తెలిపాడు చరణ్, ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాస్ బర్త్ డే నాడు చరణ్ షేర్ చేసిన ఈ పిక్ ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని, చరణ్ కంటే బాస్ అందంగా ఉన్నాడని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు చిరు విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని చిరు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 10 2025న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రం.

Show comments