Site icon NTV Telugu

Little Hearts : ఓవర్సీస్ లో పవర్ స్టార్ సినిమా కలెక్షన్స్ ని దాటేసిన లిటిల్ హార్ట్స్

Little

Little

#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది.ప్రీమియర్స్ షోస్ నుండి సూపర్ హిట్ తెచ్చుకున్న ఈ సినిమా తోలి రోజు రూ. 2.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఏ, బి సెంటర్స్ ఈ సినిమా హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతోంది.

కాగా ఓవర్సీస్ లో ఈ సినిమా మొదటి రోజు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎంతలా అంటే ఏకంగా పవర్ స్టార్ పవన కళ్యాణ్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని కూడా దాటేసేంత. అవును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ రిలీజ్ హరిహర వీరమల్లు ఓవర్సీస్ లో మొదటి రోజు $114K రాబట్టింది. ఇక మౌళి నటించిన సినిమా లిటిల్ హార్ట్స్ తోలి రోజు ఏకంగా హరిహర వేరమల్లు ను దాటేసి $115K కొల్లగొట్టింది. స్టార్ పవర్ భారీ బడ్జెట్స్ కంటే కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి నిరూపించింది లిటిల్ హార్ట్స్. ఇక సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన మరొక స్టార్ కాస్టింగ్ సినిమా ఘాటీ. అనుష్క లీడ్ రోల్ లో క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ బడ్జెట్ పై తెరకెక్కగా మొదటి రోజు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా కేవలం $27K మాత్రమే రాబట్టి డిజాస్టర్ దిశగా వెళుతోంది.

Exit mobile version