ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుని ఇండియా తీసుకోని వస్తే, ఆ అవార్డుని ఒకసారి తనని కూడా టచ్ చెయ్యనివ్వండి అంటూ బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ ‘షారుఖ్ ఖాన్’ ట్వీట్ చేశాడు. వైరల్ అవుతున్న ఈ ట్వీట్ వెనక అసలు కథ ఏంటి అంటే… షారుఖ్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా స్పై ఎంటర్టైనర్ ‘పఠాన్’ మూవీ జనవరి 25న రిలీజ్ కానుంది. దీపికా పదుకోణే, జాన్ అబ్రహం లాంటి స్టార్స్ నటించిన ఈ మూవీ ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ యష్ రాజ్ ఫిల్మ్స్ ‘పఠాన్’ ట్రైలర్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేసింది. ఒక్కో లాంగ్వేజ్ ట్రైలర్ ని ఒక్కో స్టార్ హీరోతో రిలీజ్ చేయించిన చిత్ర యూనిట్, తెలుగు వర్షన్ ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో లాంచ్ చేయించింది.
పఠాన్ ట్రైలర్ ని తెలుగులో విడుదల చేస్తూ… “Wishing the whole team of #Pathaan all the very best! Sharukh Sir looking forward to seeing you in action sequences like never before!” అంటూ ట్వీట్ చేశాడు. చరణ్ రిలీజ్ చేసిన పఠాన్ ట్రైలర్ కి తెలుగు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ స్క్రీనింగ్ లో బిజీగా ఉన్నా కూడా పఠాన్ ట్రైలర్ రిలీజ్ చెయ్యడం కోసం టైం స్పెండ్ చేసిన చరణ్ ని థాంక్స్ చెప్తూ షారుఖ్ ట్వీట్ చేశాడు. Thank u so much my Mega Power Star ram charan. When ur RRR team brings Oscar to India, please let me touch it!! (Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! ) Love you అని షారుఖ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం షారుఖ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కింగ్ ఖాన్ ట్వీట్ చేసినట్లు, ఆర్ ఆర్ ఆర్ ఫిల్మ్ యూనిట్ ఆస్కార్ ని ఇండియాకి తీసుకోని వస్తే అది దేశం గర్వించదగ్గ విషయం అవుతుంది.
Wishing the whole team of #Pathaan all the very best!@iamsrk Sir looking fwd to seeing you in action sequences like never before! #PathaanTrailerhttps://t.co/63G1CC4R20 @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/MTQBfYUfjg
— Ram Charan (@AlwaysRamCharan) January 10, 2023
Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!!
(Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! )
Love you.— Shah Rukh Khan (@iamsrk) January 10, 2023