Lavanya Shocking Comments on Lawyer: రాజ్ తరుణ్ ప్రియురాలిగా భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సూసైడ్ అటెంప్ట్ వార్తలతో హాట్ టాపిక్ అయింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నది వివరించింది. ‘’నాకు ఈ [ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజే, ఆ రాజ్ కోసమే ఫైట్ చేస్తున్నాను. వస్తాడో, రాడో తెలియదు. వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడని నమ్ముతున్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే, రాజ్ కోసం నేను పోరాడాలో లేకపోతే ఈ సొసైటీ అనే మాటలు, కామెంట్స్, తంబ్ నెయిల్స్ చూడాలో అర్థం కావడం లేదు.
Raj Tarun Case : న్యాయపోరాటం కొనసాగిస్తా.. వీలైతే ఆమరణ దీక్షకు సిద్ధం అంటున్న లావణ్య
ఇవన్నీ నేను తట్టుకోలేక పోతున్నాను. రాజ్ తల్లితండ్రుల తరపున అడ్వొకేట్ ఉదయం నాకు సపోర్ట్ గా లెటర్ ఇచ్చి ఒక ఛానల్ కి వెళ్లి తిడుతున్నాడు. ఇలాంటి మనుషుల మధ్య ఉంటే నాకు డిప్రెషన్ కాక ఏం వస్తుంది? ఒకప్పుడు ఉదయం చూసే మొదటి ముఖం, రాత్రి పడుకునే ముందు చూసే చివరి ముఖం రాజ్ దే ఉండేది. కానీ ఇప్పుడు ఇల్లు ఖాళీ అయింది. తిండి లేక ఇబ్బంది పడుతున్నా అని రాజ్ కి ఫోన్ చేస్తే మాల్వి మల్హోత్రా ఫోన్ ఎత్తేది. ఆమె చెబితేనే రాజ్ నాకు డబ్బులు వేస్తాడు.. చాలామంది నన్ను టార్గెట్ చేశారు అలా చేయడం తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్ చేశానని నటుడు రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య చెప్పుకొచ్చింది.