Site icon NTV Telugu

Lavanya: మొగుడితో సంసారం చేసినట్లు రాజ్ తో మాల్వీ కలిసి ఎందుకు ఉంటుంది?

Lavanya Comments

Lavanya Comments

Lavanya: గత కొంతకాలంగా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే చాలా కాలం తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతం వీడి హీరోగా నటించిన తిరగబడరా సామి అనే సినిమా ప్రెస్ మీట్ కి హాజరయ్యాడు. లావణ్య కేసు పెట్టిన ఈ సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా ఇదే ప్రెస్ మీట్ కి హాజరైంది అయితే రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ కి హాజరవుతున్న విషయం తెలుసుకున్న లావణ్య రాజ్ తరుణ్ ను కలవాలంటూ తిరగబడరా స్వామి ప్రెస్ మీట్ జరుగుతున్న ప్రసాద్ ల్యాబ్స్ కు వచ్చింది.

Also Read:Rakshana in Aha: ఓటీటీలోకి పాయల్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’.. ఎక్కడ చూడాలంటే?

అయితే ప్రెస్ మీట్ నిర్వాహకులు ముందే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడే మోహరించిన పోలీసులు ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తిరగబడరా సామి సినిమా ప్రెస్ మీట్ కోసం వచ్చిన రాజ్ తరుణ్ ను ఉద్దేశిస్తూ నా రాజ్ తో మాట్లాడనివ్వండి, నా భర్తతో మాల్వీ ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించింది. మొగుడితో సంసారం చేసినట్లు రాజ్ తో మాల్వీ కలిసి ఎందుకు ఉంటుంది? అని ఆమె ప్రశ్నించింది. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు అని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

Exit mobile version