NTV Telugu Site icon

Lavanya: నేను చౌదరి, రాజ్ తరుణ్ బ్రాహ్మిణ్.. పెళ్లి కాకపోతే అవెందుకు కొంటాడు?

Lavanya On Marriage

Lavanya On Marriage

Lavanya Says She is Chowdary and Raj tarun in Brahmin: హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో పోలీసులు కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ని నిందుతుడిగా చేర్చారు పోలీసులు. ఈ అంశం మీద ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన లావణ్యను పెళ్లికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అని అడిగితే ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నేను ఒక చౌదరి అమ్మాయిని, అతను బ్రాహ్మణ అబ్బాయి. మేము తెలిసీ తెలియని వయసులో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం.. మావి వేరు వేరు కులాలు కావడంతో మా పేరెంట్స్ ఒప్పుకోరు అనే ఉద్దేశంతో చిన్న వయసులోనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న మూడో నెలలో రెండు కుటుంబాలకు చెప్పాం. అప్పటినుంచి ఇప్పటివరకు మా రెండు కుటుంబాలు కలిసే ఉన్నాయి. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కూడా రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులే వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కించారు.

Lavanya : పదిమంది జీవితాలను డిస్టర్బ్ చేసి.. నన్ను అంతం చేయాలని చూశారు!!

ఈ అమ్మాయికి బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి డ్రగ్స్ కేసు పెట్టి మూయించేయొచ్చు అని అనుకున్నారు కానీ నేను ముందుకొచ్చి పోరాడుతున్నాను. అయితే పెళ్లికి ఉన్న ఆధారాలు ఏమిటి అని అడిగితే మేము ఇద్దరమే కలిసి పెళ్లి చేసుకుందాం కనీసం మూడో మనిషి ఉంటే ఫోటోలు తీసే అవకాశం ఏమైనా ఉండేది. అదే రాజ్ తరుణ్ కట్టిన తాళితో మేము సెల్ఫీలు తీసుకున్నాం అలాగే రాజ్ తరుణ్ డబ్బుతోనే ఆ తాళిబొట్టు కొనుగోలు చేశాం అని ఆమె అన్నారు. పెళ్లి కాకపోతే రాజ్ తరుణ్ అకౌంట్లో నుంచి డబ్బులు తీసి నాకు అవి ఎందుకు కొనిచ్చాడు అని ఆమె ప్రశ్నించారు. పెళ్లయిందని ప్రూవ్ చేసుకోవాలా? అయిందని ఉద్దేశంతోనే కదా 11 ఏళ్లు కాపురం చేశాను. అది కూడా నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటానని ఆమె అన్నారు.

Show comments