NTV Telugu Site icon

Mastan Sai: మస్తాన్ సాయి కేసులో సంచలనాలు.. సినీ పరిశ్రమ వారితో కలిసి డ్రగ్స్ పార్టీలు?

Masthan Sai

Masthan Sai

రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే యువకుడి హార్డ్ డిస్క్ పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా మరికొన్ని వీడియోలను లావణ్య స్వయంగా విడుదల చేసింది.మస్తాన్ సాయికి సంబంధించిన కొన్ని వీడియోలను లావణ్య విడుదల చేసింది. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీ వీడియోతో పాటు కొన్ని ఫోటోలు సైతం లావణ్య విడుదల చేసింది. మస్తాన్ సాయి ఇంట్లో అమ్మాయిలతో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు.

Trisha : త్రిషకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

ఈ పార్టీలలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా కొంతమంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక డ్రగ్స్ పార్టీ వీడియోతో సహా ఫోటోలను కూడా లావణ్య పోలీసులకు అందజేసింది. గంజాయి సహా డ్రగ్స్ వాడినట్లు ఫోటోలో నిర్ధారణ అవుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నట్లుగా వీడియోలో ఉంది. అయితే ఈ డ్రగ్స్ పార్టీ ఎప్పుడు జరిగింది? అనే విషయం మీద మాత్రం లావణ్య ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే పోలీసులకు లావణ్య అందజేసిన ఒక ఫోటో మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే అందులో డ్రగ్స్ వ్యవహారం గురించి ఉన్న న్యూస్ పేపర్ కటింగ్ ఉండగా దాని మీద డ్రగ్స్ పెట్టుకొని సేవిస్తున్నట్లు నిర్ధారణ అయింది.