Site icon NTV Telugu

వెస్ట్ వర్జీనియాలో రజినీకాంత్… పిక్స్ వైరల్

Latest stills of Thalaivar Rajinikanth in West Virginia USA

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో యూఎస్ లో ఉన్నారు. యూఎస్ లోని వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఆయన అభిమానులతో దిగిన తాజా పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో రజినీకాంత్ నీలిరంగు చొక్కా. బూడిద రంగు ప్యాంటు ధరించి కన్పిస్తున్నారు. జూన్ 19న రజినీకాంత్ తన భార్యతో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. యూఎస్ లోని మాయో క్లినిక్‌లో తన సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. 2016లో రజనీకాంత్ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన అదే ఆసుపత్రిలో రొటీన్ చెకప్ చేయించుకుంటున్నారు.

Read Also : ఎమోషనల్ అయిన అనుష్క! సోషల్ మీడియాలో స్వీటీ భావోద్వేగం…

ప్రముఖ తమిళ లిరిక్ రైటర్ వైరముత్తు ఇటీవల ఆయన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. ఆయన రజినీకాంత్ తో మాట్లాడానని, సూపర్ స్టార్ వైద్య పరీక్షలు బాగా జరిగాయని, త్వరలోనే ఇక్కడికి వస్తానని చెప్పారని తెలిపారు. ఇక ఆయన కుమార్తె ఐశ్వర్య, ధనుష్, వారి పిల్లలు కూడా ఇప్పుడు అమెరికాలోనే ఉన్నారు. రజినీకాంత్ వైద్య పరీక్షలు పూర్తవ్వగానే అందరూ కలిసి తిరిగి చెన్నై చేరుకుంటారు. ఇక ఇప్పటికే సిరుతై శివ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న “అన్నాత్తే” మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ ను త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన “అన్నాత్తే” దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కార్తీక్ నరేన్‌తో ధనుష్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “డి43” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.

Exit mobile version