Site icon NTV Telugu

శుక్రవారం ‘లక్ష్య’మ్’గా….

Lakshya Movie updates Every Friday

టాలెంటెడ్ యాక్టర్ నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. ఈ మూవీలో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త‌ లుక్‌లో నాగ‌శౌర్య‌ క‌నిపించనున్నారు. నారాయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ న‌టిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను సైతం ప్రధాన తారాగణంపై చిత్రీకరించారు. ప్రేక్ష‌కుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెరకెక్కించినట్టు నిర్మాతలు తెలిపారు.

Read Also : ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు… ప్రపంచంలోనే నెం.1…!

విశేషం ఏమంటే ఇప్పటి నుండి సినిమా విడుదల వరకూ ‘లక్ష్య’కు సంబంధించిన ప్రతి అప్ డేట్ ను శుక్రవారం జనం ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఓ పోస్టర్ ను ఇవాళ చిత్ర బృందం ట్వీట్ చేసింది. సో… అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని సైతం ప్రకటించే ఆస్కారం ఉంది. నిజానికి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకుండా ఉండి ఉంటే ‘లక్ష్య’ ఏప్రిల్ నెలాఖరులోనే విడుదల కావాల్సింది.

Exit mobile version