రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా కె. యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కె. హిమ బిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’. ఈ మూవీకి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతోన్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రాజేష్ మేరు మాట్లాడుతూ* .. ‘‘లగ్గం టైం’ కథ కంటే ముందు నేను విన్న కథలన్నీ కూడా రక్తపాతంతో కూడుకున్నవే. కానీ ఈ కథ విన్న వెంటనే సినిమాని చేయాలని అనిపించింది. ఎంతో కష్టపడి ఈ మూవీని తీశాం. మీడియా ఇచ్చిన సపోర్ట్ వల్ల మా చిత్రం ఆడియెన్స్ వరకు రీచ్ అయింది. అందరినీ ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 6న మా మూవీనీ అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
*నిర్మాత కె. హిమబిందు మాట్లాడుతూ* .. ‘ఎన్నో కష్టాలు, ఎంతో ఖర్చు పెట్టి ‘లగ్గం టైం’ని నిర్మించాం. మా సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతోన్నాం. మా మూవీని చూసి బాగుందా? లేదా? అన్న అభిప్రాయాన్ని ఆడియెన్స్ చెబుతారని ఆశిస్తున్నాం. కానీ ఈ రీ రిలీజ్‌ల వల్ల మాలాంటి చిన్న నిర్మాతలు, చిన్న చిత్రాలకు అంతగా గుర్తింపు రావడం లేదు. ఈ రీ రిలీజ్‌లను కూడా శుక్రవారం, వీకెండ్‌కే విడుదల చేస్తుంటే.. మాలాంటి చిన్న చిత్రాలకు అంతగా ఆదరణ లభించదు. మాలాంటి చిన్న సినిమాలకు వీకెండ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ రీ రిలీజ్‌ల విషయంలో ఒకసారి అందరూ ఆలోచించాలి. ‘లగ్గం టైం’ని చూసి థియేటర్ నుంచి మనస్పూర్తిగా నవ్వుతూ వెళ్తారని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను’ అని అన్నారు.
