Site icon NTV Telugu

Monalisa : మొన్న హీరోయిన్..ఇప్పుడు ఓపెనింగ్స్.. దశ తిరిగింది పో !

Monalisa

Monalisa

‘కుంభమేళా’లో పూసలమ్ముతూ సోషల్ మీడియా కంట పడి ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా హీరోయిన్గా ఈమధ్యనే ఒక తెలుగు సినిమా మొదలైంది. ఇక ఇప్పుడు ఆమె ఓపెనింగ్స్ కూడా మొదలు పెట్టేసింది. మోనాలిసా శనివారం ఉదయం హైదరాబాద్‌లోని బేల్ ట్రీ హోటల్ నూతన కిచెన్ విభాగాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ పద్ధతిలో జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసిన ఆమెకు హోటల్ యాజమాన్యం ఘనస్వాగతం పలికింది.

Also Read: Train Derailment: ఏనుగులను ఢీకొట్టి పట్టాలు తప్పిన రైలు.. తృటిలో తప్పిన ప్రమాదం..

కిచెన్ విభాగాన్ని స్వయంగా సందర్శించిన మోనాలిసా, అక్కడ వసతులను చూసి ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా హోటల్ అధినేత రాజారెడ్డి మాట్లాడుతూ, సంస్థ పేరు వెనుక ఉన్న పరమశివుని భక్తిని చాటుకున్నారు. “బేల్ ట్రీ అంటే తెలుగులో బిల్వ వృక్షం. ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ దళాల పేరునే మా సంస్థకు పెట్టుకున్నాం. కాశీ అన్నపూర్ణేశ్వరి సమేతుడైన ఆ విశ్వేశ్వరుడి ఆశీస్సులతో, ఇక్కడ మేము అందించే ప్రతి భోజనం ఒక *ప్రసాదంలా కస్టమర్లకి తృప్తినివ్వాలని మా సంకల్పం.” అన్నారు. ఇక మోనాలిసా రాకతో హోటల్ పరిసర ప్రాంతాలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. తనను చూడటానికి వచ్చిన వారందరికీ ఆమె చిరునవ్వుతో అభివాదం చేస్తూ, అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు.

Exit mobile version