NTV Telugu Site icon

Kumaradevam Movies Tree : 300 సినిమాల్లో కనిపించిన చెట్టు ఇక లేదు

Kumaradevam Movies Tree

Kumaradevam Movies Tree

Kumaradevam Movies Tree Fell Down: ఎన్నో గోదావరి ప్రాంతం ఉన్న సినిమాలలో కనిపించిన ఒక 150 ఏళ్లు వయసున్న చెట్టు ఇప్పుడు నేలకొరిగింది. 1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి రంగస్థలం వరకు ఆ చెట్టు ఓ ఐకాన్ సింబల్ గా భావించేవారు దర్శకులు. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా అనేక సినిమాల్లో కనిపించింది ఆ చెట్టు. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని కూడా చెబుతూ ఉంటారు. 150 సంవత్సరాల వయస్సున్న ఈ చెట్టు చుట్టూ దాదాపు 300 సినిమాల షూటింగ్‌లు జరగడం విశేషం అని అంటారు.

AP CM Chandrababu: ఏపీ యువతకు ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలి..

దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారని కూడా చెబుతారు. అంతటి పేరు, ఫేమస్ అయిన ఈ చెట్టు కూలిపోయింది. దీంతో స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుందని అంటే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండేది ఈ చెట్టు. ఈ మధ్యకాలంలో వచ్చిన గోదావరి వరదలకు ఆ చెట్టు కుప్పకూలినట్లుగా తెలుస్తుందని అంటున్నారు. ఇంతకు మించిన సమాచారం అందుబాటులో లేదు. మొత్తం మీద 150 ఏళ్ల వయసున్న ఆ చెట్టు చుట్టూ అధికారికంగా 300 సినిమాలు చేశారు. అనధికారికంగా ఇంకా ఎన్ని చేసి ఉంటారు అనేదానికి లెక్క లేదని స్థానికులు చెబుతున్నారు.

Show comments