NTV Telugu Site icon

Kubera: ‘కుబేర’ నుండి పిపిపి.. డుండుండుం.. సాంగ్ రిలీజ్

Kuberaa Rashmika Song

Kuberaa Rashmika Song

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ , రష్మిక మందన్న, కింగ్ నాగార్జున కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’ . క్లాసిక్ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా వ్యావహరిస్తున్న ఈ మూవీ జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు మేక‌ర్స్. ఇప్పటికే విడుద‌ల చేసిన పాట‌లు, గ్లిమ్స్ టీజ‌ర్ మూవీపై అంచ‌నాల‌ను రెట్టింపు చేయగా తాజాగా మూడో పాట కూడా వదిలారు.

Also Read : Singer Mangli : సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టివేత..

పీపీ డుండుండుం అంటూ ర‌ష్మిక‌పై చిత్రీక‌రించిన ఈ సాంగ్‌ను మేక‌ర్స్ నేడు విడుద‌ల చేశారు. చైత‌న్య పింగ‌ళి సాహిత్యం అందించిన ఈ పాట‌ను మంగ్లీ సోద‌రి ఇంద్రావ‌తి చౌహాన్ ఆల‌పించ‌గా, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం స‌మ‌కూర్చాడు. ఈ పాట వింటుంటే మ‌రో హిట్ అవ‌డ‌మే గాక సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రష్మిక లుక్ చాలా సింపుల్‌గా ఉంది. ఒక కలేజ్ అమ్మాయిగా చిలిపి తనంగా కనిపించింది.

  YouTube video player