Site icon NTV Telugu

Kriti Sanon: వామ్మో.. ఆ బ్లాక్ గౌను ఖ‌రీదు అన్ని లక్షలా?

Kriti Sanon

Kriti Sanon

కృతిసనన్ అంటూనే మనకు గుర్తుకు వచ్చే సాంగ్ కార్తీక్ ఆర్యన్ తో నటించిన ఫోటో సాంగ్. ఈ సాంగ్ ఎంత హిట్ అయ్యిందంటూ కుర్రకారులను ఉర్రూతలూగించింది. అయితే ఓ ఫంక్షన్ లో మొరిసి అందరి దృష్టిని తనవైపు మళ్లించుకుంది. కృతిసనన్ బ్యాక్​లెస్​ డ్రస్సులతో దిగిన హాట్​ హీట్​ ఫొటోలతో ఇప్పుడు సోషల్​ మీడియాలో హీట్​ పుట్టిస్తుంది ఈపొడువుకాళ్ల సుందరి. అయితే.. తాజాగా ముంబయిలో జరిగిన సినిమా అవార్డుల ఫంక్షన్​కు బ్యాక్​లెస్ బ్లాక్​ గౌన్​లో మెరిసింది. అందరిని సమ్మోహన పరిచేలా ఉండే ఆమె అందం, ఆ నల్లటి డ్రస్సు, కృతిసనన్ అందం మరింత రెట్టింపు అయ్యింది. దీంతో చర్చ అంతా ఆ గౌను పైనే జరుగుతోంది.

ఆమె అందాన్ని మరింతపెంచిన ఆ గౌను ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అయితే.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆ గౌను కోసం కృతిసనన్​ భారీగానే వెచ్చించింది. దాదాపు రూ. 7.4 లక్షల వెచ్చించి ఆ బ్లాక్​ గౌనును కృతి సనన్ ప్రత్యేకంగా తయారు చేయించుకుంది. క్రిస్టియన్ అడ్నెవిక్ అనే డిజైనర్ ఈ బ్లాక‌ డ్రస్సును ప్రత్యేకంగా డిజైన్​ చేశారు. బ్లాక్​ డ్రస్సులో దిగిన ఫొటోలను కృతి ఇన్​స్టాలో షేర్​ చేయగానే అది క్షణాల్లోనే వైరల్​గా మారాయి. అయితే ఈ అమ్మ‌డు ప్రస్తుతం ప్రభాస్​ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ లో నటిస్తోంది.

Exit mobile version