Site icon NTV Telugu

“బంగార్రాజు” కోసం బేబమ్మ ?

Krithi Shetty got offer from Bangarraju Makers

“ఉప్పెన” బ్యూటీ కృతి శెట్టికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. “ఉప్పెన” చిత్రం విడుదలయ్యాక అందరూ ఈ బేబమ్మ నామజపమే చేశారు. ఇక ఆ క్రేజ్ తో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆఫర్లతో ఆమె ఇంటి తలుపు తడుతున్నారు. ఇంకేముంది ఇప్పుడు కృతి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా… త్వరలో తెరకెక్కనున్న కింగ్ నాగార్జున క్రేజీ ప్రాజెక్ట్ “బంగార్రాజు” కోసం నిర్మాతలు కృతి శెట్టిని సంప్రదించారట. ఇందులో బేబమ్మను హీరోయిన్ గా నటించమని అడిగారట.

Read Also : హాలీవుడ్ ఎంట్రీపై అలియా ఆశలు

“ఉప్పెన”లో ఆమె నటన చూసి నాగ్ ఫిదా అయ్యారట. అందుకే తన నెక్ట్స్ మూవీ “బంగార్రాజు”లో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఈ మేరకు కృతి శెట్టి పేరును సూచించాడట నాగ్. ఈ చిత్రం గనుక హిట్ అయితే ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడం ఖాయం. ఇక ఆమె రేంజ్ అందనంత ఎత్తుకు ఎదిగిపోతుంది. “బంగార్రాజు” స్క్రిప్ట్ దాదాపుగా పూర్తయింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దాని కోసం కాస్టింగ్ ప్రారంభించారు. మరోవైపు కృతి శెట్టి ప్రస్తుతానికి శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబు, రామ్‌లతో సినిమాలు చేస్తోంది.

Exit mobile version