హాలీవుడ్ ఎంట్రీపై అలియా ఆశలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు హాలీవుడ్ పై కన్నేసింది. అవకాశాల కోసం ఆమె ఓ ఏజెన్సీ ద్వారా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ మేరకు అలియా భట్ ప్రముఖ అంతర్జాతీయ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ‘డబ్ల్యూఎంఇ’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టాప్ ఏజెన్సీ ద్వారానే టాలెంటెడ్ బ్యూటీ ఫ్రీడా పింటో… హాలీవుడ్ మూవీస్ ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’, ‘ఇమ్మోర్టల్స్’ చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం అలియా కూడా అదే బాటలో పయనించాలని సన్నాహాలు చేస్తోంది. డబ్ల్యూఎంఇతో చేతులు కలిపిన అలియా ప్రస్తుతం హాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

Read Also : పూజా తదుపరి ప్రాజెక్ట్ కు షాకింగ్ రెమ్యూనరేషన్…!!

ఇటీవల కాలంలో ఉడ్తా పంజాబ్, గల్లీ బాయ్ లాంటి చిత్రాలతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ఆ అమ్మడు ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’తో థియేటర్లలోకి రానుంది. బాలీవుడ్ లో సత్తా చాటిన అలియా ఇప్పుడు తన టాలెంట్ తో హాలీవుడ్ ప్రేక్షకుల మనసు కూడా దోచుకుని ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే లాంటి హీరోయిన్ల జాబితాలో చేరడానికి సిద్ధమవుతోంది. అలియా ఇప్పటివరకు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను దక్కించుకుంది. ఇటీవల ఆమె నటించిన ‘గల్లీ బాయ్’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉన్న చిత్రాలతో సహా అలియా తన కిట్టిలోని పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బ్రహ్మస్త్రా, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో నటిగా, ఓ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-