Site icon NTV Telugu

Krithi Shetty: కృతి శెట్టి.. ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

Krithi Shetty Tamil Debut

Krithi Shetty Tamil Debut

టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో గోల్డెన్ లెగ్‌గా మారిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చవిచూశారు. వరుస పరాజయాలతో బేబమ్మ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి.. కోలీవుడ్ ప్రాజెక్ట్స్‌కు కమిటయ్యారు. కానీ ‘వా వాతియార్’, ‘లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ’, ‘జీని’ సినిమాలు ఏ టైంలో సైన్ చేసిందో కానీ.. రోజుల తరబడి షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. హమ్మయ్య ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టాయి అనుకున్న వా వాతియార్, లిక్ పలు మార్లు వాయిదా పడి డిసెంబర్ బరిలోకి వస్తాయంటే వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు కార్తీ వా వాతియర్ అన్ని సమస్యలు సాల్వ్ చేసుకుని సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. అయితే కృతి ఏ ఇండస్ట్రీలో అడుగుపెడితే.. డెబ్యూ మూవీతో కచ్చితంగా వంద కోట్లు కొల్లగొట్టాల్సిందే. ఒక్కసారే కాదు.. మూడు సార్లు ఆ మ్యాజిక్ జరిగింది.

Also Read: Nari Nari Naduma Murari Hit: ఒక్క సినిమా.. ముగ్గురు కంబ్యాక్!

హృతిక్ రోషన్ సూపర్ 30తో కృతి శెట్టి కెరీర్ స్టార్ చేశారు. ఆ సినిమా ఏకంగా రూ.200 కోట్లను వసూలు చేసింది. వైష్ణవ్ తేజ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ‘ఉప్పెన’తో హీరోయిన్ అయ్యారు బేబమ్మ. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ బొమ్మ.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కృతిని ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేసింది. అంతేకాదు ఉప్పెన మూవీ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక్కడే కాదు మలయాళంలో ఈ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. టొవినో థామస్ హీరోగా వచ్చిన ఏఆర్ఎంతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2024లో రిలీజైన ఈ మూవీకి కాసుల వర్షం కురిపించారు మలయాళ ఆడియన్స్. ఈ బొమ్మ కూడా వంద కోట్లను కొల్లగొట్టింది. ఇలా త్రీ ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన ప్రతి సినిమా హండ్రెడ్ క్రోర్ వసూలు చేయడం యాదృచ్చికమో, లక్కో తెలియదు కానీ.. ఇప్పుడు తమిళ ఆడియన్స్ ముందుకు వచ్చారు. మరీ వా వాతియార్‌తో హండ్రెడ్ క్రోర్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version