NTV Telugu Site icon

Krishnamma : “కృష్ణమ్మ” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. అతిధులుగా రానున్న తెలుగు స్టార్ డైరెక్టర్స్..?

Satyadev's Krishnamma

Satyadev's Krishnamma

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అద్భుతమైన నటనతో వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’.దాదాపు రెండు సంవత్సరాల తరువాత సత్యదేవ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను  కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించారు.ఈ మూవీలో అర్చనా అయ్యర్, అతిరా రాజ్, కృష్ణ బూర్గుల మరియు లక్ష్మణ్ మీసాల ముఖ్య పాత్రలు పోషించారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కృష్ణమ్మ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి. ఈ సినిమా మే 10వ తేదిన విడుదల కానుంది.

ఈక్రమంలో మే 1న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ ఈవెంట్‍ హైదరాబాద్‍లోని హైటెక్ సిటీ ట్రైడెంట్ హౌటల్‍లో మే 1 సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.ఇదిలా ఉంటే కృష్ణమ్మ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా ఐదుగురు తెలుగు స్టార్ డైరెక్టర్లు ముఖ్య అతిథిలుగా రానున్నారు..దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ,సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి మరియు గోపిచంద్ మలినేని కూడా చీఫ్ గెస్టులుగా రానున్నారు. ఒకే వేదికపైకి ఈ ఐదుగురు స్టార్ డైరెక్టర్లు రానున్నారు. దీంతో ప్రేక్షకులలో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పై చాలా ఆసక్తి నెలకొని ఉంది.తెలుగు సినిమాలో ఇది గ్రాండెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అని కృష్ణమ్మ మేకర్స్ తాజాగా ట్వీట్ చేశారు.

Show comments