NTV Telugu Site icon

Krishana Chaitanya : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదట వారితో తీద్దాం అనుకున్నా.. కానీ..?

Krishna Chaitanya (1)

Krishna Chaitanya (1)

Krishana Chaitanya : ఛల్ మోహన్ రంగ మూవీ ఫేమ్ దర్శకుడు కృష్ణ చైతన్య ,మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”..ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ పక్కా మాస్ పాత్రలో కనిపించాడు..ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.రీసెంట్ గా ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.విశ్వక్ సేన్ మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Read Also :Eesha Rebba : విశ్వక్ తో ఈషా రెబ్బా ఐటమ్ సాంగ్.. కానీ..?

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ కు నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చారు.ఈ సినిమాతో విశ్వక్ సేన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని బాలయ్య బెస్ట్ విషెస్ తెలియజేసారు.ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న దర్శకుడు కృష్ణ చైతన్య ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు.ఈ సినిమా కథకు మూలం మహాభారతం అని ఆయన తెలిపారు.మన వాడు అనుకునే వాడే నీ మొదటి శత్రువు అనే మాటని స్ఫూర్తిగా తీసుకోని ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా కృష్ణ చైతన్య తెలిపారు.అయితే ఈ కథను ముందుగా శర్వానంద్ ,రాశి ఖన్నా తో తీయాలని అనుకున్నాను.అయితే త్రివిక్రమ్ గారి సూచనతో విశ్వక్ సేన్ కు కథ చెప్పగా విశ్వక్ వెంటనే ఒప్పుకోవడంతో ఈ సినిమా ప్రయాణం మొదలైంది అని కృష్ణ చైతన్య తెలిపారు.

Show comments