Site icon NTV Telugu

హీరోలపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

Kota Srinivasa Rao Sensational Comments on Tollywood Stars

ప్రముఖ సీనియర్ నటుడు నటుడు కోటా శ్రీనివాస్ రావు తెలుగు హీరోలు, తాజాగా జరుగుతున్న ‘మా’ కాంట్రవర్సీపై స్పందించారు. స్టార్ హీరోలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “మా తెలుగు హీరోలు తమ సినిమాల కోసం చాలా కాస్ట్యూమ్స్ మార్చుకుంటూ ఉంటారు. కానీ వారికి ఇంకా జ్ఞానం రాలేదు. వారు ప్రతిసారీ తెలివితక్కువగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్క హీరో కూడా చేతిలో మైక్‌ పట్టుకుని సరిగ్గా మాట్లాడలేడు” అంటూ ఫైర్ అయ్యారు.

Read Also : హైదరాబాద్ లో షూటింగ్స్ హంగామా మామూలుగా లేదు!

ప్రస్తుతం జరుగుతున్న “మా” వివాదం గురించి ఆయన మాట్లాడుతూ “అంతర్గత సమస్యలను పరిష్కరించడానికి ప్రెస్‌ను ఆహ్వానించాల్సిన అవసరం ఏమిటి? ‘మా’లోని అంతర్గత సంఘర్షణను మరింత ప్రెస్ కవరేజ్ ఇవ్వడం ద్వారా వారు సంచలనాత్మకంగా మార్చాలనుకుంటున్నారు. ‘మా’ ఎన్నికల సమస్యను ప్రెస్, ప్రజలు పరిష్కరిస్తారా? వీటన్నిటిలో ప్రెస్ పాల్గొనడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ” అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ వివాదం తెలివితక్కువతనమని, గతంలో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదని తేల్చి చెప్పేశారు కోట. పరిస్థితులు ఇంకా గజిబిజిగా మారకముందే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నానని అని కొత్త శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

Exit mobile version