హైదరాబాద్ లో షూటింగ్స్ హంగామా మామూలుగా లేదు!

కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. కానీ షూటింగ్స్ హంగామా మాత్రం మామూలుగా లేదు. స్టార్ హీరోస్ సినిమాల నుండి యంగ్ హీరోస్ మూవీస్ వరకూ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులైతే మార్నింగ్ ఒక షూటింగ్ లోనూ ఈవినింగ్ మరో షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. కొన్ని చిత్రాల షూటింగ్స్ రాత్రిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే ఈ మూల కోకాపేట నుండి ఆ మూల ఫిల్మ్ సిటీ వరకూ ఒకటే సందడి. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోకాపేటలోని సెట్ లో జరుగుతోంది. మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను సైతం దర్శకుడు పరశురామ్ ప్లాన్ చేశాడు. ఇక అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘పుష్ప’ షూటింగ్ భూత్ బంగ్లాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ 22వ తేదీ వరకూ ఉండబోతోంది.

Read Also : కరోనా కాలంలోనూ… ‘బ్లాక్ విడో’కి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్!

ఈ రోజు ఉదయం టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగిన రవితేజ ‘రామారావు’ సినిమా షూటింగ్ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నాని ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ షూటింగ్ సి.బి.ఐ.టీ. సమీపంలో వేసిన కలకత్తా నగరం సెట్ లో జరుగుతోంది. అలానే వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంటే, వరుణ్ తేజ్ ‘గని’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. ఇక కింగ్ నాగార్జునతో ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో జరుగుతోంది. గోపీచంద్ తో మారుతీ రూపొందిస్తున్న ‘పక్కా కమర్షియల్’ మూవీ షూటింగ్ కోకాపేటలో జరుగుతుంటే, హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో రామ్ – లింగస్వామి మూవీ షూటింగ్, అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ షూటింగ్ జరుగుతున్నాయి.

Read Also : “ఆర్ఆర్ఆర్”ను బీట్ చేసేసిన “వాలిమై”

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్‌’ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే దర్శకుడు ఓంరౌత్ ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ పై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ప్రభాస్‌ షూటింగ్ లో లేరు. ఇక పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ఈ పాటికే మొదలు కావాల్సింది. కానీ వన్ వీక్ పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం. సినిమాల చిత్రీకరణ హంగామా ఇలా ఉంటే… మరికొందరు ఆర్టిస్టులు ఇప్పటికే షూటింగ్, ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలకు డబ్బింగ్ చెప్పడంలో బిజీగా ఉన్నారు. మొత్తానికి ఈ యేడాది ద్వితీయార్ధంలో కరోనా థర్డ్ వేవ్ లేకపోతే మాత్రం సినిమాల సునామీ ఖాయం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-