NTV Telugu Site icon

Kona Venkat: బాద్‌షాకి కాదు బ్రూస్‌లీ’కి డిజప్పాయింట్ అయ్యా!

Kona Venkat

Kona Venkat

తెలుగు సినీ రచయిత కోన వెంకట్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక సినిమాలకు ఆయన అందించిన కథలు బాగా సెట్ కావడంతో సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే చివరిగా అంజలితో గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా కథ అందించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు ఆయన. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బాద్షా సినిమా సమయంలో తాను రైటర్గా డిసప్పాయింట్ కాలేదని చెప్పుకొచ్చారు. బాద్షా కచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మెమరబుల్ ఫిలిం.

Rajendra Prasad: ‘రాబిన్ హుడ్’తో నితిన్ రేంజ్ మారుతుంది.. భలే గమ్మత్తుగా ఉంటుంది!

అందులో ఉన్న పాటలు, బ్రహ్మానందం గారి ట్రాక్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని అన్నారు.. రైటర్ గా నాకు బాద్షా పేరు తీసుకొచ్చిన సినిమా అని అన్నారు. అయితే డిసప్పాయింట్ చేసింది బాద్షా కాదు బ్రూస్ లీ సినిమా అని అన్నారు. బ్రూస్ లీ వర్కౌట్ కాలేదని అన్నారు. శ్రీను వైట్లతో నన్ను చరణే మళ్ళీ కలిపాడు, నిజానికి అప్పటికి గాయం పచ్చిపచ్చిగా ఉంది ఇంకా గాయం అప్పటికి మానలేదు. ఆ పచ్చిగా ఉండటం వల్ల బలవంతపు వ్యవహారాల నడిచింది. అయితే ఇప్పుడంతా సద్దుమణిగింది అని అన్నారు. అది కూడా వర్కౌట్ అయి ఉంటే గోపి మోహన్, నాకు, శ్రీనుకి ఇండస్ట్రీకి తిరుగులేని ఆధిపత్యం వచ్చేది. కానీ అది దేవుడు డిజైన్ చేయలేదేమో అని ఇప్పుడు అనిపిస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు