NTV Telugu Site icon

Kollywood : తమిళ సెలబ్రిటీల వరుస విడాకులు.. ఎందుకంటే?

Divorce

Divorce

నిన్న రాత్రి ఎవరూ ఊహించని విధంగా రెహమాన్ భార్య తను తన భర్త రెహమాన్ నుంచి విడిపోతున్నాను అంటూ తన లాయర్ చేత ఒక ప్రకటన ఇప్పించింది. ఒక్కసారిగా వచ్చిన ఈ ప్రకటన గురించి ఒకటే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తమిళ సినీ పరిశ్రమలో ఈ విడాకుల కల్చర్ బాగా పెరిగిపోయిందని అంటున్నారు. సుమారు ఏడాది వ్యవధిలో దాదాపు మూడు నాలుగు జంటలు విడాకుల బాట పడ్డాయి. ముఖ్యంగా ఈ ఏడాది ముగ్గురు సెలబ్రిటీలు ఎవరు ఊహించని విధంగా విడాకుల ప్రకటనలు చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు నటుడు జీవి ప్రకాష్ కుమార్ గురించి. ఆ తర్వాత నా హీరో జయం రవి గురించి ఇప్పుడు రెహమాన్ గురించి.

Venkatesh: ఆ హిట్ డైరెక్టర్ తో వెంకీ మామ నెక్స్ట్

ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ కూడా తన భార్య సైంధవి నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక వీరు కాకుండా దర్శకుడు బాలాతో పాటు మరో సంగీత దర్శకుడు ఇమ్మాన్ కూడా తన భార్య నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ధనుష్ కూడా తన భార్య సౌందర్య నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో ఈ తరహా విడాకుల అంశాలు తెరమీదకు వస్తూ ఉండటం గమనార్హం. అయితే అక్కడే ఎందుకు ఇలా విడాకుల సంఖ్య ఎక్కువ నమోదవుతోంది అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి.

Show comments