కోలీవుడ్ స్టార్ హీరోస్ అజిత్, సూర్య సినిమాల విషయంలో ఫ్యాన్స్ కన్ఫ్యుజన్, టెన్షన్‌తో బుర్రలు పాడు చేసుకుంటున్నారు. తల అప్ కమింగ్ మూవీ విదాముయర్చి వివాదంలో చిక్కుకోవడమే హర్డ్ కోర్ ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉన్న విదాముయర్చి 1997లో వచ్చిన హాలీవుడ్ బ్రేక్ డౌన్‌కు రీమేక్ అని రెండిటిని పోలుస్తూ సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ గా మారాయి ఇది కాస్త హాలీవుడ్ నిర్మాణ సంస్థ చెంతకు చేరింది.
విదాముయర్చి టీజర్‌లో కొన్ని సీన్స్ ‘బ్రేక్ డౌన్’కు రిలేటెగా ఉండటంతో సదరు నిర్మాణ సంస్థ కాపీ రైట్స్ ఉల్లంఘన కింద లైకా ప్రొడక్షన్స్‌కి 15 మిలియన్ డాలర్ల పరిహారం కోరినట్లు కోలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.
Also Read : Prabhas : రాజాసాబ్ రిలీజ్ డేట్ పై అనుమానం..?
దీంతో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందో రాదోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. మరోవైపు సూర్య డై హార్ట్ ఫ్యాన్స్‌ది మరో ఆందోళన. కంగువా రిజల్ట్‌తో సూర్యనే కాదు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా డీలా పడ్డారు. దీంతో కార్తీక్ సుబ్బరాజుతో సూర్య చేస్తున్న సినిమాపై ఫాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో పాటు RJ బాలాజీతో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య 45గా తెరకెక్కుతున్న ఈ మూవీపైనే ఫ్యాన్స్ దిగులంతా. సూర్య ఓ ప్లాప్ మూవీని రీమేక్ చేస్తున్నాడట. ఆర్జే బాలాజీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న సూర్య 45 రవితేజ ప్లాప్ మూవీ వీర స్టోరీకి దగ్గరగా ఉందని లేటెస్ట్ బజ్. ఈ మేటర్ లీక్ కావడంతో ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ప్లాప్ మూవీ రీమేక్ ఏంటన్నా అంటున్నారు.