‘మనీ హయిస్ట్’ బాటలో మళయాళ ‘కొచ్చి హయిస్ట్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీపీ లవర్స్ ను భలేగా ఆకట్టుకుంది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన వెబ్ సీరీస్ ‘మనీ హయిస్ట్’. నిజానికి ఇది స్పెయిన్ సీరీస్ ‘లా కాసా డి ప్యాపెల్’ పేరుతో అలరించింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ సీరీస్ 15 ఎపిసోడ్స్ తో మురిపించింది. అయితే దీనిని 22 ఎపిసోడ్స్ కు మలచి కొంత రీ షూట్ చేసి ‘నెట్ ఫ్లిక్స్’ ఇదే సీరీస్ ను ‘మనీ హయిస్ట్’ పేరుతో స్ట్రీమింగ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందడంతో ‘హయిస్ట్ సీరీస్’పై ఎంతోమంది మనసు పారేసుకున్నారు. బ్యాంకును దోపిడీ చేసే కథతో ఈ సీరీస్ తెరకెక్కి, దోపిడీ చిత్రాలలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. రియల్ టైమ్ క్రైమ్ తో ఫ్లాష్ బ్యాక్స్ ద్వారా ఈ సీరీస్ రక్తి కట్టించింది. ఈ సీరీస్ ప్రేరణతో ప్రస్తుతం మళయాళంలో ‘కొచ్చి హయిస్ట్’అనే సీరీస్ ను రూపొందించారు. ఏప్రిల్ 29న రాత్రి 12 గంటలకు ‘బిహైండ్ ఊడ్స్’లో ఈ ‘కొచ్చి హయిస్ట్’ ప్రసారం కానుంది. బిహైండ్ ఊడ్స్ నిర్మించిన ఈ సీరీస్ కు అతుల్ .ఆర్ దర్శకత్వం వహించగా, కార్తిక్ శంకర్, దేవిక నంబియార్ ప్రధాన పాత్రధారులు.
కొచ్చిలో జరిగే దోపీడీ కథతో ఈ సీరీస్ తెరకెక్కింది. ‘మనీ హయిస్ట్’ స్ఫూర్తితో రూపొందిన ఈ ‘కొచ్చి హయిస్ట్’లోనూ థ్రిల్ కలిగించే అంశాలు ఉంటాయని అతుల్ అంటున్నాడు. కేరళవాసులను ఈ సీరీస్ ఆకట్టుకుంటుందనే ఆశాభావంతో ఉన్నాడు అతుల్. ‘మనీ హయిస్ట్’ ఇప్పటికి నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ సీరీస్ కు ఉన్న క్రేజ్ ను బట్టి ఐదో సీజన్ కూడా రూపొందించాలనే ప్లాన్ లో నెట్ ఫ్లిక్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో కానీ, ఆ లోగా మన దేశవాసులను ‘కొచ్చి హయిస్ట్’ ఆకట్టుకుంటుందనే అభిలాషతో ఈ సీరీస్ యూనిట్ మెంబర్స్ ఉన్నారు. ఈ ‘కొచ్చి హయిస్ట్’ ట్రైలర్ ను ఇటీవల ప్రముఖ మళయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఆవిష్కరించాడు. ప్రస్తుతం ‘కొచ్చి హయిస్ట్’ ట్రైలర్ కూడా జనాన్ని అలరిస్తోంది. మరి ఈ వెబ్ సీరీస్ ఏ తీరున ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
- Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
- Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్‌లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!