రామ్ చరణ్ హీరోగా ఇటీవల గేమ్ చేంజర్ అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. పెద్ది అనే ప్రచారం జరుగుతోంది కానీ టైటిల్ ఫిక్స్ చేసేదాకా అది నిజమా కాదా అనేది చెప్పలేం. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్ కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చింది ఆమె ఇంకెవరో కాదు రామ్ చరణ్ ముద్దుల తనయ క్లీన్ కారా కొణిదల. షూటింగ్లో భాగంగా రామ్ చరణ్ వెళుతుండగా తన కుమార్తెను కూడా షూటింగ్ కి తీసుకు వెళ్లారు.
W/O Anirvesh: చిత్ర బృందాన్ని అభినందించిన అల్లరి నరేష్.
ఇక తన కుమార్తెతో కలిసి సెట్లో రామ్ చరణ్ అన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో వెంటనే వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాని స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కెరియర్ లోనే మొట్టమొదటి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఉప్పెన లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈయన ఒకప్పుడు మైత్రి మూవీ మేకర్స్ లో పార్ట్నర్ గా ఉండేవారు. తర్వాత సొంతగా వృద్ధి సినిమాస్ బ్యానర్ ఏర్పాటు చేసి మొదటి సినిమాగా రామ్ చరణ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.