NTV Telugu Site icon

Raviteja: ప్రేమ కబుర్లు చెబుతానంటున్న రవితేజ

Raviteja (1)

Raviteja (1)

రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపులతో సతమౌతున్న మాస్ మహారాజ్ గట్టి కంబ్యాక్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. రీసెంట్లీ రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా రవికి ఓ మైల్ స్టోన్ మూవీలాంటిది. ఇప్పటి వరకు 74 సినిమాలు కంప్లీట్ చేసిన ఈ ఎనర్జటిక్ బాయ్.. 75 వ పిక్చర్‌గా మాస్ జాతర చేస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు మాస్ మహారాజ్. మరింత యంగ్‌గా, ఎనర్జటిక్‌గా మెస్మరైజ్ చేశాడు. ఇందులో ఇడియట్ మూవీలో చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్ రీమిక్స్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధమాకా తర్వాత శ్రీలీల జోడీకడుతున్న మాస్ జాతరను మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా, రవితేజ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. క్లాస్ డైరెక్టర్ కిశోర్ తిరుమల స్ట్రిప్ట్ నచ్చి.. ఓకే చెప్పాడని ఫిల్మ్ నగర్లో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. మాస్ జాతర కంప్లీట్ కాగానే.. కాస్త గ్యాప్ ఇచ్చి.. కిశోర్ తో వర్క్ చేస్తాడని టాక్.

Tollywood: ఈ డూప్స్ ఏంటయ్యా.. ఇలా ఉన్నారు?

నేను శైలజ, ఉన్నటీ ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను అందించిన కిశోర్ తిరుమలలో ఓ మాసీ డైరెక్టర్ కూడా ఉన్నాడు. రామ్ పోతినేనికి రెండు క్లాస్ హిట్లు ఇచ్చిన ఇదే డైరెక్టర్ రెడ్ లాంటి ఊర మాస్ సినిమా తీసి.. హ్యాట్రిక్ హిట్ అందించాడు. సో ఇప్పుడు కూడా అటు ఫ్యామిలీ, ఇటు మాస్ కథతోనే రవితేజను అప్రోచ్ అయ్యాడని టాక్. స్క్రిప్ట్ నచ్చి ఓకే చెప్పాడని, తర్వలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. చకా చకా కంప్లీట్ చేసి 2026 సంక్రాంతికి పిక్చర్ రిలీజ్ చేయబోతున్నారన్న బజ్ కూడా నడుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి అనార్కలి అనే టైటిల్ అనుకుంటున్నారట. టైటిల్ వింటుంటే ఇదేదో ప్రేమ కథలా ఉంది. మరీ ఈ ఫిల్మ్ మేకర్.. మాస్ మహారాజాను క్లాస్ హీరోగా మార్చుతాడో.. మరింత మాసీ లుక్కులో చూపిస్తాడో చూడాలి.