బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించి, థియేటర్లలో సంచలన విజయం సాధించిన హారర్-థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ అనుభూతిని పంచింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ, భారతదేశపు అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్ర పోషించారు.
Also Read:Ari Movie Review : అనసూయ ‘అరి’ రివ్యూ
రేడియో స్టేషన్ నేపథ్యంలో సాగే ఈ కథ, వెన్నులో వణుకు పుట్టించే ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, “నేను పోషించిన అత్యంత కఠినమైన పాత్రలలో ఇది ఒకటి. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు మన ముందు భయానక పరిస్థితులు ఉండవు, కేవలం ఊహించుకుని నటించాలి. నటుడిగా ఇది నన్ను నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకువచ్చింది. సెట్‌లో నిరంతరం భయం, అనిశ్చితి వాతావరణంలో జీవించాల్సి వచ్చింది. ఆ రేడియో స్టేషన్ వింతైన వాతావరణం నాతో పాటు ఇంకా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఓటీటీలో కూడా ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
