బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఇప్పుడు తన కెరీర్‌లో ఓ సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కిష్కింధపురి’ అనే థ్రిల్లర్‌లో తీవ్రమైన భావోద్వేగాలతో కూడిన హారర్ ఎలిమెంట్స్‌ను మేళవించి, అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యాడు. కౌశిక్ పేగళ్లపాటి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరపతి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాను ఒకరోజు వాయిదా వేయాలని అనుకున్నారు. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో చెప్పిన డేటుకే దించుతున్నారు.
Also Read : India-US: “ట్రంప్ భారీ తప్పు చేశాడు, భారతీయులు తలవంచరు”.. సుంకాలపై యూఎస్ ఎక్స్‌పర్ట్..
ఇటీవల విడుదలైన టీజర్, ‘కిష్కింధపురి’ భయానక, రహస్యమైన ప్రపంచానికి ఒక ఆసక్తికరమైన గ్లింప్స్‌ను అందించింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన మునుపటి చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఎమోషనల్‌గా ఇంటెన్స్‌గా ఉండే పాత్రలో కనిపించనున్నాడు. అతని సరసన అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, ఈ కాంబినేషన్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 3న ఉదయం 11:07 గంటలకు విడుదల కానుందని ప్రకటించారు. ట్రైలర్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ చేతిలో రేడియోలు పట్టుకుని నిలబడి ఉండటం, ఒక క్రీపీ కన్ను సినిమా భయానక ప్రపంచాన్ని మరింత హైలైట్ చేస్తోంది. ఈ ట్రైలర్, ‘కిష్కింధాపురి’ రహస్యాలను మరింత లోతుగా ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఆకర్షించనుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.