Site icon NTV Telugu

Kiran Abbavaram : మీడియా నుంచి ఇన్ని కాల్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్

Kiran Abbavaram

Kiran Abbavaram

యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘KA’ (కే-ర్యాంప్) థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చిన్న మెసేజ్‌ను అందిస్తూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు.”ఈ దీపావళికి నాకు మళ్లీ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. ఊర్లు, టౌన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది” అని కిరణ్ అబ్బవరం అన్నారు. ప్రెస్ షో చూసిన మీడియా మిత్రులు తమకు బాగా నవ్వుకున్నామని కాల్ చేసి చెబుతున్నారని, మార్నింగ్ షో చూసిన మీడియా నుంచి ఇన్ని కాల్స్ రావడం ఇదే మొదటిసారి అని ఆయన వెల్లడించారు.

Also Read : K Ramp: క రికార్డ్ బద్దలు కొట్టలేక పోయిన కె ర్యాంప్

ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్తున్నారని, షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని, స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయని కిరణ్ తెలిపారు. “ఇప్పుడున్న కాంపిటేషన్‌లో ఇంతమంచి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు” అని ఆయన అభిప్రాయపడ్డారు. పండక్కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి, చిన్న మెసేజ్ ఇవ్వాలి, ఒక వైబ్ మూవీలో ఉండాలని చేసిన ప్రయత్నమిది అని వివరించారు.సినిమా రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇదే విషయాన్ని క్లియర్‌గా చెప్పామని కిరణ్ గుర్తు చేశారు. “‘KA’తో మంచి సక్సెస్ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్” అని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version