Kiran Abbavaram: వారి కోసమే ‘రియాలిటీ’ మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు!

Kiran Abbavaram Reality

Kiran Abbavaram Reality

Kiran Abbavaram on Reality Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించడమే కాకుండా.. దర్శకత్వం వహించిన చిత్రం ‘రియాలిటీ’. దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం ‘రుత్తూ’ పాటను విడుదల చేసింది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో కిరణ్, హీరోయిన్ దేవిక, పూర్ణాచారి, సుధాకర్, సనారే, విశ్వాస్ డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తనకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు.

‘నేను ఎక్కడికి వెళ్లినా.. నేను ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమాభిమానాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ, ఆదరణ దక్కింది. కుటుంబమంతా కలిసి థియేటర్‌కు వెళ్లి చూడాలనే ఉద్దేశంతోనే ఈ కథ రాశాను. రియాలిటీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కరు హ్యాపీగా థియేటర్లకు వెళ్లండి. తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే భజగోవిందం పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయిన రుత్తూ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అని కిరణ్ అబ్బవరం ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రియాలిటీ సినిమాపై చిత్రబృందం భారీ అంచనాలు పెట్టుకుంది. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.